తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్

2 May, 2017 20:21 IST|Sakshi
తెలంగాణ విద్యుత్‌ శాఖలో కొలువుల జాతర

హైదరాబాద్‌ : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. విద్యుత్‌ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జెన్‌ కో పరిధిలోని 13,357 పోస్టులు భర్తీ కానున్నాయి. జెన్ కో, ట్రాన్స్కో, డిస్కమ్లలో జూనియర్ లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీకి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే  విద్యుత్ శాఖలోని దాదాపు 10 వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు