'దామాషా పద్ధతిన ఎస్టీలకు రిజర్వేషన్లు'

24 Sep, 2015 19:23 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, ఇతర అన్ని రంగాల్లోనూ ఇదే విధానంలో రిజర్వేషన్లు అమలు చేయాలని గురువారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో కోరారు.

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల హామీని 16 నెలల కాలంలో ఎందుకు అమలుచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం వెంటనే ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు