పీహెచ్‌సీలో సిబ్బంది కొరత 

29 Mar, 2018 09:32 IST|Sakshi
వైద్యుల కోసం నిరీక్షిస్తున్న చంటిపిల్లల తల్లులు

ఉన్న సిబ్బంది సమయపాలన పాటించని వైనం

ఇబ్బందులు పడుతున్న రోగులు

మొయినాబాద్‌(చేవెళ్ల) : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోగా ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రికి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయం 8 గంటలకు సుమారు 50 మందికి పైగా చంటిపిల్లల తల్లులు ఆస్పత్రికి వచ్చారు.

అప్పటికే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి రావాల్సిన వైద్య సిబ్బంది తీరిగ్గా 12.30 గంటలకు వచ్చి అప్పడు టీకాలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు చిన్న పిల్లలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు