డిజిటల్‌ నానో కోప్‌ ప్రారంభం

31 Jan, 2018 02:54 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అశోక్‌ మన్‌సుఖానీ

ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్, హిందూజా 

మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో..  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేబుల్‌ ఆపరేటర్లను ఆర్థిక స్వతంత్రులను చేయడంతోపాటు స్వయం ఉపాధి కల్పించుకునేందుకు తోడ్పాటు అందించే లక్ష్యంతో హిందూజా మీడియా గ్రూపు ఆధ్వర్యంలో ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్‌ నానో కోప్‌ను ఖమ్మంలో ప్రారంభించింది. కేబుల్‌ ఆపరేటర్లను స్వతంత్ర వ్యాపారిగా తీర్చిదిద్ది.. ఎవరిపై ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యంతోపాటు ఈ డిజిటల్‌ ద్వారా నాణ్యమైన ప్రసారాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అందించాలనేదే తమ ప్రధాన ధ్యేయమని హిందూజా మీడియా గ్రూపు ఎండీ, సీఈవో అశోక్‌ మన్‌సుఖానీ చెప్పారు.

తెలంగాణ రీజినల్‌ హెడ్‌ శ్రీకుమార్‌తో కలసి ఆయన మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్‌లో నానోకోప్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు. దేశంలో అతిపెద్ద డిజిటల్‌ టీవీ కం పెనీ వేదికగా ఉన్న ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్‌ రంగంలో ఆపరేటర్లకు మరింత చేరువ కావడం ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రతి ఆపరేటర్‌ రూ.15 లక్షల ఖర్చు తో 500కు పైగా చానల్స్‌ వచ్చే లా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.  

గ్రామీణ ప్రాంతాల ఆపరేటర్లు రూ. 4.40 లక్షలతో దాదాపు 250 చానల్స్‌ను వీక్షకులకు అందించవచ్చని, నగర ప్రాంత ఆపరేటర్లు హెచ్‌డీ నాణ్యతగల చానల్స్‌ను అందించగలుగుతారన్నారు. కేబుల్‌ రంగంలో హిందూజా గ్రూపుకు ఉన్న అనుభవంతో కేబుల్‌ ఆ పరేటర్లను అనుసంధానం చేసి.. వారి కి వ్యాపార ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. కేబుల్‌ ఆపరేటర్లు తమతో అనుసంధానమైతే ఎక్కడి నుంచైనా ప్రసారాలను ఆపరేట్‌ చేసుకోవచ్చని శ్రీకుమార్‌ తెలిపారు. ప్రాంతీయ అవసరాలకు తగినట్టు ప్యాకేజీల రూపకల్పన జరుగుతుందని, ‘మీ నె ట్‌వర్క్‌.. మీ వ్యాపారం.. మీ లాభాలు’నినాదంతో తమ వ్యాపార ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు