బాబ్రీ ఎఫెక్ట్‌ ఫుల్‌ ఫోర్స్‌

6 Dec, 2019 07:02 IST|Sakshi

నగరంలో భారీ బందోబస్తు   

నేడు 144 సెక్షన్‌ అమలు   

తాజా పరిణామాలతో అదనపు ఏర్పాట్లు  

రంగంలోకి రాష్ట్ర, కేంద్ర బలగాలు  

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పరిస్థితుల్లోనే బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజైనడిసెంబర్‌ 6వ తేదీ నగర పోలీసులుభారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలనేపథ్యంలో ఈసారి మరింత కట్టుద్టిమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలుచోటుచేసుకోకుండా మూడు కమిషనరేట్ల అధికారులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. డిసెంబర్‌ 6ను కొన్ని సంస్థలుబ్లాక్‌ డేగా, మరికొన్ని విజయ్‌ దివాస్‌గా జరుపుకోవడం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శుక్రవారం నగరవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించనున్నట్లు ప్రకటించారు. సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలను నిషేధించడంతో పాటు ఒకేచోట నలుగురికి మించి గుమిగూడకూడదని స్పష్టం చేశారు. బుధవారం నుంచే అదనపు బలగాలను రంగంలోకి దించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పాతబస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం అక్కడ మకాం వేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. 

అన్ని విభాగాలు...  
సీసీఎస్, సిట్, స్పెషల్‌ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్, సిటీ ఆర్‌ఏఎఫ్, టీఎస్‌ఎస్‌పీలతో పాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ లాంటి కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 300 మంది సివిల్, 70 ప్లటూన్ల సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. ‘డిసెంబర్‌ 6’ నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ ప్రతిఏటా ర్యాలీకి ప్రయత్నిస్తుంటుంది. ఈసారి కూడా పోలీసులు దీనికి అనుమతి ఇవ్వలేదు. సున్నిత, అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరించారు. గతంలో తీవ్ర పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి షాడో టీమ్‌లను ఏర్పాటు చేశారు. క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్‌ పాయింట్ల ద్వారా వాహనాలను సోదా చేయనున్నారు. పాతబస్తీతో పాటు శివార్లలోని ప్రాంతాల్లో అణువణువూ నిఘాలో ఉంచారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పాతబస్తీతో పాటు పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రస్తు తం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా పక్కా బందోబస్తు ఏర్పా టు చేస్తున్నాం. ఉన్నతాధికారులందరూ అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా రు. పోలీసు రికార్డుల్లో ఉన్న కమ్యూనల్, కరుడుగట్టిన రౌడీ షీటర్లలో చాలామంది ఇప్పటికే జైళ్లల్లో ఉన్నారు. బయట ఉన్న వారిలో అవసరమనుకున్న వారిని బైండోవర్‌ చేస్తున్నాం’ అని తెలిపారు.  

మరిన్ని వార్తలు