అన్ని జిల్లాల్లో ‘అవతరణ’ వేడుకలు

26 May, 2019 05:49 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, జెండావిష్కరణ చేసే వారి పేర్లను ఆయన ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పాల్గొని జెండావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు.

మంత్రులు కొప్పుల ఈశ్వర్‌ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్‌ (ఖమ్మం), ఈటల రాజేందర్‌ (కరీంనగర్‌), శ్రీనివాస్‌ గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), మల్లారెడ్డి (మేడ్చల్‌), ఐకే రెడ్డి (నిర్మల్‌), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్‌), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్‌ రావు (వరంగల్‌ అర్బన్‌), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్‌ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్‌ లక్ష్మణ్‌ (జయశంకర్‌ భూపాలపల్లి), ఏకే గోయల్‌ (కొమురంభీం ఆసిఫాబాద్‌), ఏకే ఖాన్‌ (మహబూబాబాద్‌),

రాజీవ్‌ శర్మ (మంచిర్యాల), అనురాగ్‌ శర్మ (నాగర్‌ కర్నూల్‌), డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ (నల్లగొండ), ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగ్‌ రూరల్‌), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్‌), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్‌ (జోగులాంబ గద్వాల), దఫేదార్‌ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్‌), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్‌), బాలు నాయక్‌ (యాదాద్రి భువనగిరి)లు ఆయా జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో పాల్గొననున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా