15 వరకు ఓటర్ల నమోదు 

8 Jan, 2020 03:51 IST|Sakshi

ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా 

సీఈఓ రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020లో భాగంగా గత నెల 16న ముసాయి దా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ నెల 15వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పుల్ని సరిచేయడానికి విజ్ఞప్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్ర వరి 7న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఓటర్లను భౌగోళికంగా సులువుగా గుర్తించేందుకు వారి గృహాల మ్యాపు(నజరీ నక్షా)ను తయారు చేస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యోమాలు నిర్వహించాలని, డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి.

మరిన్ని వార్తలు