అవతరణ దినోత్సవానికి భారీ భద్రత

2 Jun, 2017 01:34 IST|Sakshi

జగిత్యాల క్రైం : రాష్ట్ర అవతరణ దినోత్సవం శుక్రవారం ఖిలాలో జరగనున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అనంతశర్మ తెలిపారు. గురువారం పోలీసు క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 300 మందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు డీఎస్పీలతోపాటు ఆరుగురు సీఐలు, 29 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 50 మంది, కానిస్టేబుళ్లు 135 మంది, హోంగార్డులు 50, మహిళా కానిస్టేబుళ్లు ఆరుగురు,

 మహిళ హోంగార్డ్స్‌ 20, జిల్లా గార్డ్స్‌ 60 మంది, ఏఆర్‌ 21 మంది బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. ఖిలా పరిసర ప్రాంతాల్లో రెండు పార్కింగ్‌ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఖిలా లోపల జగిత్యాల డీఎస్పీ కరుణాకర్, వెలుపల మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డిలకు భద్రత ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారు. ఖిలా ఆవరణలోకి చీఫ్‌విఫ్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రముఖుల వాహనాలకే మాత్రమే అనుమతి ఇచ్చారు. వీఐపీ గ్యాలరీకి పాస్‌లు జారీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పాస్‌లు అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు