ఆవిష్కరణకు అందలం!

26 Jul, 2017 03:22 IST|Sakshi
ఆవిష్కరణకు అందలం!
ఇన్నోవేషన్‌ పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
 
సాక్షి, హైదరాబాద్‌: ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల రంగంలో రాష్ట్ర ఇన్నోవేషన్‌ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రోత్సహించడం, పోటీత త్వాన్ని పెంపొందించడం, దిగువ స్థాయి వరకు నైపుణ్యాన్ని తీసుకెళ్లడం, ఆర్థిక తోడ్పాటు, అనువై న వాతావరణాన్ని కల్పించేందుకు పాలసీని తీసు కొచ్చింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్యక్రమ నిర్వహణ సమర్థత.. ఆర్థిక సహాయానికి సుస్థిర నమూనాలు.. ప్రాథమిక విద్య దశలోనే సృజనాత్మకత, ప్రయోగాలు చేసేలా వాతావరణం కల్పించి నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయడం... నిరంతరం పరిశోధనలను పెంపొందించడం, వాటిని గుర్తించడానికి పరిశ్రమలతో క్రియాశీల సంబంధాలు ప్రోత్సహించడం.. అదనపు రాయితీ, ప్రోత్సాహకాలు అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్స్‌ను ప్రోత్సహిం చాలనే 5 ప్రధాన లక్ష్యాలను అంది పుచ్చు కోవడానికి ఈ కొత్త పాలసీని ప్రకటించిం ది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌ల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. 
 
ఇంక్యుబేటర్లకు రాయితీలు
తొలి సేల్‌ డీడ్‌/లీజ్‌ డీడ్‌ లావాదేవీలపై ఇంక్యుబేటర్లు, హోస్ట్‌ సంస్థలకు 100 శాతం స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. రెండోసారి 50 శాతాన్ని చెల్లిస్తుంది. 
ఇంక్యుబేటర్లు సమీకరించే రుణాలపై కేంద్ర ప్రభుత్వ సాయంతో మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ మంజూరు చేయనుంది. 
ఏడాదికి రూ.2.5 లక్షలు మించకుండా మూడేళ్లు 25 శాతం ఇంటర్నెట్‌ చార్జీలను తిరిగి చెల్లించనుంది. 
ఇంక్యుబేటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకుంటే ఇంక్యుబేటర్‌ నిలదొక్కునే వరకు, లేదా గరిష్టంగా 5 ఏళ్ల వరకు భవనం అద్దె, నిర్వహణ చార్జీలను మాఫీ చేయనుంది. 
ప్రైవేట్‌ భవనాన్ని అద్దెకు తీసుకుంటే మూడేళ్ల పాటు చదరపు అడుగుకు రూ.5 లేదా చెల్లించిన అద్దెలో 25 శాతం (రెండింట్లో ఏదీ తక్కువైతే అది)ను తిరిగి చెల్లించనుంది.
భవనం, స్థలం ఖర్చులు కాకుండా ఇంక్యుబేటర్‌ ఏర్పాటుకు ఇతర పెట్టుబడుల్లో 20 శాతం రూ.30 లక్షలకు మించకుండా సబ్సిడీగా మంజూరు చేయనుంది.
 
స్టార్టప్‌లకు రాయితీలు
రూ.కోటి వార్షిక టర్నోవర్‌ గల స్టార్టప్‌లకు రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్‌జీఎస్టీ)ను మూడేళ్లు ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. 
ట్రేడ్‌షోల ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ కార్యక్రమాలకు చేసే ఖర్చులో ఏటా రూ.5 లక్షలకు మించకుండా 30 శాతం ఖర్చును తిరిగి చెల్లించనుంది. 
భారతీయ పేటెంట్‌ పొందేందుకు రూ.2 లక్షలు, విదేశీ పేటెంట్‌కు రూ.10 లక్షల వరకు ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. 
నియామకాలను ప్రోత్సహించేందుకు తొలి ఏడాది ఒక్కో ఉద్యోగికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకాలను స్టార్టప్‌లకు అందించనుంది. 
ఏటా 15 శాతం వార్షిక టర్నోవర్‌ వృద్ధి సాధించే కంపెనీలకు తొలి మూడేళ్లు రూ.10 లక్షలకు మించకుండా టర్నో వర్‌లో 5 శాతం ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించనుంది.
మరిన్ని వార్తలు