బీసీలను ప్రభుత్వం మోసగించింది: జాజుల

2 Jan, 2019 03:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసిందని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల అత్యవసర సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తు న నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు.

బీసీ రిజర్వేషన్‌ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప బోమని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టి రిజ ర్వేషన్లు దక్కించుకుంటామని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ సురేం ద్రను ఏకపక్షంగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా అవమానించారన్నారు. రిజర్వేషన్ల కేసు హైకోర్టులో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని జస్టిస్‌ ఈశ్వరయ్య ప్రశ్నించారు. బీసీలకు మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ వ్యతిరేకమేనని ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు గండికొట్టి దాన్ని రుజువు చేసిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బీసీల ఉసురు తగులుతుందని బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకులు వీజీఆర్‌ నారగోని, పి.రామకృష్ణయ్య అన్నారు. 

మరిన్ని వార్తలు