హుజూర్‌నగర్‌ ఇన్‌చార్జిగా పల్లా

25 Sep, 2019 01:28 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం అమలు బాధ్యతను అప్పగించిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌:హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పార్టీ ప్రధానకార్యదర్శి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌ నియమించారు. హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి పార్టీ ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను పల్లాకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను పల్లా సమన్వయం చేస్తారు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, ఇతర జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ యంత్రాంగా న్ని సన్నద్ధం చేయాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశించారు.

సీనియర్‌ నాయకులు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశిం చారు. కాగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి స్థానికంగా ప్రచారం, సమన్వయం కోసం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తారు. పార్టీ తరఫున నిర్వహించే సభలు, ర్యాలీలు, కేసీఆర్‌ పాల్గొనే కార్యక్రమాలు తదితరాలకు సంబంధించి పల్లా తుదిరూపు ఇస్తారు. ఈ నెల 26న పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేస్తారు.  

పాలేరు, ఇతర ఎన్నికల అనుభవంతోనే..! 
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ  కంటే ముందు ప్రచార పర్వంలో దూసుకెళ్లేలా కేసీఆర్‌ వ్యూహం సిద్ధం చేశారు. ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో తనకు సన్నిహితంగా ఉండే పల్లాకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పల్లాతో కలిసి పనిచేయా ల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాలేరు ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల్లో పల్లా ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లోనూ పల్లా పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనగామ, భువనగిరి జిల్లాల పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆయనకు పార్టీ బాధ్యత అప్పగించిన ప్రతి సందర్భంలోనూ టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితం రావడంతో..  హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బాధ్యతను పల్లాకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు

28 నుంచి ‘జాగృతి’ బతుకమ్మ

నట్టింట్లో ట్రింగ్‌..ట్రింగ్‌!

ఎంఐఎం  టిక్‌ టాక్‌

గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల 

ఐక్యతకు ప్రతీక బతుకమ్మ 

ట్రీట్‌మెంట్‌ అదిరింది

బకాయిల ‘ఎత్తిపోత’

చెట్టు లేకపోతే భవిష్యత్‌ లేదు

రోడ్లన్నీ బిజీ.. కాస్త ఆలస్యంగా వెళ్లండి! 

3 రోజుల్లో తేల్చకుంటే సమ్మెబాట

ఉప పోరు హోరు

రుణమాఫీకి రూ.28 వేల కోట్లు

కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

‘ఒకే దేశం ఒకే జెండా బీజేపీ నినాదం’

ప్రజల ఓపిక నశిస్తోంది : లక్ష్మణ్‌

మాయ‘దారి’.. వాన

రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లండి: భట్టి

టీహబ్‌.. ఇంక్యుబెటర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ నీళ్లతో ప్రజలు బట్టలు ఉతుకుతున్నారు!

నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

ఏ రాష్ట్రంలోనూ లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు?

అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..

చిన్నారి చికిత్సకు హైకోర్టు కీలక ఆదేశాలు

కోడెల మృతిపై పిల్‌ కొట్టివేత

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం