కుస్తీ ఘనత మనదే

23 Jan, 2015 00:51 IST|Sakshi
కుస్తీ ఘనత మనదే

కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రపంచానికి కుస్తీని నేర్పిన ఘనత మన దేశానికే దక్కిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఇండియన్ స్టైల్ రె జ్లింగ్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల మల్లయుద్ధ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. 2005లో అప్పటి ప్రభుత్వం కరీంనగర్, కడప జిల్లాల్లో క్రీడాపాఠశాలు మంజూరు చేసిందన్నారు.

కడప స్పోర్ట్స్ స్కూల్‌కు అటానమస్ హోదాను కల్పించి, కరీంనగర్ స్కూల్‌ను నిర్లక్ష్యం చేసింద ఉందని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన వివక్షకు ఇది నిదర్శనమని చెప్పారు. నెలరోజుల్లో కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేసి రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర మల్లయుద్ధం సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ మల్లయుద్ధం క్రీడకు నేడు రాష్ట్రంలో ఆదరణ కురైవందని, ప్రభుత్వం చేయుతనివ్వాలని కోరారు.

త్వరలో హైదరాబాద్‌లో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధానకార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, డీఎస్‌డీవో సత్యవాణి, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యాక్షుడు కరీం, జిల్లా మల్లయుద్ధం సంఘం బాధ్యులు అజ్మీర రాములు, శ్రీకాంత్, భిక్షపతి, వెంకన్న, కోచ్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
ముగిసిన ఎంపిక పోటీలు
ఈ పోటీలకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు కర్ణాటక రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
 
రాష్ట్ర పురుషుల జట్టు
55కేజీ విభాగంలో అబుబుద్దీన్ ఖాలియా, 61 కేజీలు ఇజార్ అలీఖాన్, 67 కేజీలు బి.మోహన్‌గాంధీ, 75 కేజీలు జి.నితీష్‌కుమార్ యాదవ్, 85కేజీలు అబ్దుల్హ్రీం, షేక్ మహ్మద్ ఇమ్రోజ్, ఓపెన్ కేటగిరీలో మహ్మద్ ఆక్రం ఎంపికయ్యారు. వీరంతా హైదరాబాద్‌కు చెందినవారే.
 
రాష్ట్ర మహిళల జట్టు
50 కేజీ విభాగంలో శ్యామల, 56కేజీలు శిరీష, 63కేజీల విభాగంలో మౌనిక (కరీంనగర్),కాజల్ (హైదరాబాద్) ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు