లంబాడా రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి

19 Jun, 2018 14:23 IST|Sakshi
మంత్రి జోగు రామన్నను కలిసి సమస్యను విన్నవిస్తున్న దృశ్యం 

ఎదులాపురం(ఆదిలాబాద్‌) : లంబాడా కులానికి చెందిన రెవెన్యూ సిబ్బంది కొలాం రైతులను మోసం చేస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. సోమవారం కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొలాం రైతులకు రైతుబంధు పథకం వర్తించకుండా లంబాడా కులానికి చెందిన రెవెన్యూ ఉద్యోగులు కుటిల ప్రయత్నాలు చేస్తూ అన్యాయం చేశారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ఐదెకరాలు ఉన్న కొలాం గిరిజన రైతు భూమిని గుంటలుగా చూపిస్తూ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ యాక్ట్‌ను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి ఆదిలాబాద్, నార్నూర్‌ తహసీల్దార్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి సమస్యను విన్నవించారు.

మామిడిగూడ, సల్పలగూడ, పోతగూడ, హత్తిగుట్ట, తిప్ప, చితగుడ, ముక్తాపూర్, అడ్డగుట్ట, యాపల్‌గూడ, తదితర గ్రామాల రైతులు తానాజీ కురుసింగా, రత్నజాడె ప్రజ్ఞకుమార్, టేకం సురేష్, నందులాండ్గే పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు