ఇక‌పై ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినం : అంజనీకుమార్

20 Apr, 2020 15:30 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ :  రాష్ర్టంలో లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమలుచేస్తామ‌ని సీపీ అంజ‌నీకుమార్  తెలిప‌రు. సోమ‌వారం క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ..రూల్స్ పాటించ‌ని వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఆంక్ష‌లు అతిక్ర‌మించి వాహ‌నాలు న‌డ‌ప‌వ‌ద్ద‌ని సూచించారు. ఇప్ప‌టికే 69,288 వాహ‌నాల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. రాష్ర్టంలో రోజురోజుకూ క‌రోనాకేసులు పెరుగుతున్నందున ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. ఆన్‌లైన్ ఫుడ్ స‌ర్వీసుల‌పై ఆంక్ష‌లు ఉన్నాయ‌ని, వీటిని  అతిక్ర‌మించి రోడ్ల‌పైకి వ‌స్తే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌న్నారు. అన్నిమ‌తాల వారు ఇళ్ల‌లోనే పండుగ‌ల‌ను జ‌రుపుకోవాలని కోరారు.

"లాక్‌ఢౌన్ అమ‌లుపై పోలీస్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించాం. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో నేటినుంచి లా అండ్ ఆర్డ‌ర్ మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. కంటైన్మెంట్ లాంటి ప్రాంతాల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న 12 వేల మంది పోలీసుల‌కు పీపీఈ  కిట్లు అందించాం. ఐటీసెల్ త‌ర‌పున పాస్‌ల కోసం ఓ పోర్ట‌ల్‌ను ప్రారంభించాం. కలర్ మాత్రమే కాదు బ్లాక్ అండ్ వైట్  పాస్‌లు  కూడా అనుమతించబడతాయి. అయితే దీన్ని మిస్ యూజ్ చేస్తే త‌క్ష‌ణం పాసుల‌ను క్యాన్సిల్ చేసి వారి  వాహ‌నాల‌ను సీజ్‌చేస్తాం" అని అంజ‌నీకుమార్ వెల్ల‌డించారు.


 

>
మరిన్ని వార్తలు