కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

5 Jan, 2019 02:37 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌కార్పొరేషన్ల పరిధిలోకోడ్‌ వర్తించదు: వి.నాగిరెడ్డి 

బలవంతపు ఏకగ్రీవాలకుపాల్పడితే చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)కమిషనర్‌ వి.నాగిరెడ్డి హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ పరిధి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పంచా యతీ ఎన్నికల కోడ్‌ వర్తించదని తెలిపారు. ఇప్పటివరకు కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన కేసులు నమోదు కాలేదని చెప్పారు. శుక్రవారం ఓ ప్రైవేట్‌ హోటల్లో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఆయా వర్గాలపై ఒత్తిళ్లు తెచ్చి బలవంతంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. అ లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగితే రీ పోలింగ్‌ జరిపేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇ చ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో పోలీసులు అందుబాటులో ఉంటారని, అవసరమైతే అదనపు బలగాలూ అందుబాటులో ఉంటాయ న్నారు. ఎన్నికల్లో నిర్దేశించిన వ్యయ పరిమితిని మించి ఖర్చుచేస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. గత ఎన్నికల్లో ఖర్చులు చూపెట్టని వారి ని అనర్హులుగా ప్రకటించినట్లుగానే, ఈసారి కూడా ఎన్నికల ఖర్చు అధికంగా చేస్తే కఠిన చర్య లుంటాయన్నారు. పంచాయతీల్లో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.

గ్రామ పంచాయితీలకు సం బంధించిన కొత్త పథకాలు మాత్రం చేపట్టేందుకు వీల్లేదని తెలిపారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల సం ఘం కార్యదర్శి అశోక్‌ కుమార్, ఎన్నికల పరిశీలకు లు, ఆడిట్‌ అధికారులు పాల్గొన్నారు. వీరికి 2018 కొత్త పంచాయతీ చట్టం, ఎన్నికల విధులు, విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యయ పరిశీలకులకు జిల్లాలు కేటాయించినట్లు తెలియజేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై పరిశీలకులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. 

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు.. 
ఈ నెలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వి.నాగిరెడ్డి తెలిపారు. 

ఎన్నికలపై ఉన్నతస్థాయి సమీక్ష..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వీటితో ముడిపడిన అంశాలపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న వివిధ ప్రాంతాల్లోని శాంతి భద్రతలు, బడ్జెట్, రవాణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ సిబ్బంది నియామకాలపై చర్చించారు. సమావేశంలో సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, అదనపు డీజీపీ జితేందర్, రాష్ట్ర ఎన్నికల సం ఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు