పోలింగ్‌ బూత్‌లో  ఫొటోలు తీస్తే చర్యలు 

12 May, 2019 05:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ బూత్‌లలో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొంతమంది పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లు పోలింగ్‌ సందర్భంగా ఓటు వేస్తున్న ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఫొటోలు తీసే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు