ఏపీలో సమ్మె యథాతథం

12 May, 2015 01:50 IST|Sakshi
ఏపీలో సమ్మె యథాతథం

హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కోరుతూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం ఆరోరోజూ రాష్ట్ర వ్యాప్తం గా సాగింది. సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అఖిలపక్ష నేతలు అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్లల్లో వినతి పత్రాలు అందించారు. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం నియమిస్తున్న తాత్కాలిక డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

సోమవారం నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరిన తాత్కాలిక డ్రైవర్ బస్సు బయటకు తీస్తుం డగా సెక్యూరిటీ షెల్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కోరినట్టు 3 వారాల గడువును ఇచ్చేది లేదని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) రాష్ట్ర నేతలు పద్మాకర్, దామోదర్  తేల్చిచెప్పారు.  
 

మరిన్ని వార్తలు