నిఘా ‘గుడ్డి’దేనా!

21 May, 2019 09:18 IST|Sakshi
స్ట్రాంగ్‌ రూమ్‌ లు ఉన్న ఆర్‌ఆర్‌ఎస్‌ కళాశాల భవనం సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ ఫుల్‌ అయినట్టు చూపుతున్న దృశ్యం

సీసీ భద్రత లేని స్ట్రాంగ్‌ రూం నామమాత్రంగా కెమెరాలు

హార్డ్‌డిస్క్‌ స్టోరేజ్‌ నిండిపోవడంతో రికార్డుకాని డేటా

శుక్రవారం గుర్తించిన అధికారులు

పటాన్‌చెరుటౌన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి ఆర్‌ఆర్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పటాన్‌చెరు, అమీన్‌పూర్, గుమ్మడిదల, జిన్నారం మొత్తం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీసీ కెమెరాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి.

రికార్డు కాని డేటా..
మొత్తం హార్డ్‌డిస్క్‌ 931.51 జీబీ ఉండగా మొత్తం 931.51జీబీ ఫుల్‌ కావడంతో ఫ్రీ స్పేస్‌ లేదని డిస్ప్లేలో చూయిస్తుంది. ఈ విషయాని గమనించిన అధికారులు గత శుక్రవారం సీసీ కెమెరాల స్టోరేజీ పెంచాలనీ నిర్వాహకులకు సూచించారు. అయితే వారు స్టోరేజీ పెంచకుండా అలాగే వదిలి వేశారు. దీంతో డేటా రికార్డు కాకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్లుగా ఉంది. ఇదే హార్డ్‌డిస్క్‌ స్టోరేజీ విషయంపై అధికారుల వివరణ కోరగా ఇప్పటికే ఈ విషయాని నిర్వహకులకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వారు బాగుచేయలేదని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా