గజ్వేల్‌లో స్టువర్టుపురం దొంగల ముఠా అరెస్టు 

22 Dec, 2019 10:23 IST|Sakshi
చోరీలకు పాల్పడిన ముఠా సభ్యుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

వివరాలు వెల్లడించిన పోలీసులు

గజ్వేల్‌రూరల్‌: చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు తెలిపారు. శనివారం గజ్వేల్‌లో సీఐ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు శుక్రవారం మఫ్టిలో ఉన్న పోలీసులకు కనబడగా... వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారన్నారు.
 
స్టూ్టవర్టుపురం దొంగలు.. 
వీరంతా గుంటూరు జిల్లా బాపట్ల మండలం çస్టూవర్టుపురం గ్రామానికి చెందిన మాసపాటి వెంకటేశ్వర్లు అలియాస్‌ పెద్దులు, గజ్జెల అంకాలు, అవుల రాజవ్వలు ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణీకుల నుంచి పిక్‌ పాకెటింగ్‌తో పాటు బ్యాగులను చోరీ చేసేవారన్నారు. వీరు విజయవాడ, బాపట్ల, గూడురు, పిడుగురాల్ల, సూర్యారావుపేట, చీరాల, బోనకల్, కాల్వపాలెం, సత్తెనపల్లి ప్రాంతాల్లో 20వరకు చోరీలు చేసి జైలు వెళ్ళివచ్చారని తెలిపారు.  

నేరాల వివరాలు.. 
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జేబీఎస్‌ నుంచి సిద్దిపేటకు బస్సులో వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగును దొంగిలించి.. అందులో ఉన్న 5తులాల బంగారు ఆభరణం తీసుకొని బ్యాగును బస్టాండ్‌ ప్రాంతంలో పడేసి, నగలను తమకు తెలిసిన ఓ వ్యక్తి(కోటయ్య)వద్ద పెట్టారన్నారు. అదే విధంగా మే నెలలో స్వరూప అనే మహిళలు పిల్లతో కలిసి ప్రజాపూర్‌లో బస్సు ఎక్కేసమయంలో ఆమెకు అడ్డుగా వెళ్ళి బ్యాగులో నుంచి పర్సును దొంగిలించగా... అందులో రూ. 21వేల నగదు, నల్లపూసల దండ, రింగులు, మాటీలను, ఆగస్టు నెలలో సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి బస్సు ఎక్కేసమయంలో మహిళ బ్యాగులో నుంచి పర్సును దొంగిలించగా.. అందులో లాంగ్‌చైన్, నెక్లెస్, నల్లపూసల దండను, అక్టోబర్‌ నెలలో నాచారం గుడివద్ద బస చేసి మరుసటి రోజు గజ్వేల్‌ బస్టాండ్‌ వద్ద ఆటోలో ప్రయాణీస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి చంద్రహారం, నల్లపూసల దండ, బంగారు లాకెట్, వంకు ఉంగరాలు, కమ్మలు, చిన్నపిల్లల ఉంగరాలతో ఉన్న పర్సును చోరీ చేసినట్లు తెలిపారు. 

స్వాధీనం చేసుకున్న సొమ్ము.. 
వీరి వద్దనుంచి ఐదున్నర తులాల బంగారు పెద్దగొలుసు, 4తులాల చంద్రహారం, 3తులాల నల్లపూసల దండ, రెండున్నర తులాల నల్లపూసల దండ, 1.25తులాల బంగారు లాకెట్‌ను స్వా«దీనం చేసుకున్నామన్నారు. గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో గజ్వేల్‌ సీఐలు ఆంజనేయులు, మ«ధుసూదన్‌రెడ్డి, సిద్దిపేట 1టౌన్‌ సీఐ సైదులు, క్రైం పార్టీ సిబ్బంది యాదగిరి, రాంజి, సుభా‹Ùలు ప్రత్యేక టీంగా ఏర్పడి నేరస్తులను పట్టుకోవడం జరిగిందని  వీరికి సిద్దిపేట సీపీ రివార్డును అందించినట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా