కాలేయం ఇచ్చినా... దక్కని ప్రాణం

9 Nov, 2018 09:02 IST|Sakshi

ముత్తారం(మంథని): ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. గతంలో అనారోగ్యంతో తల్లి మరణిం చింది. ఇప్పుడు ఇంటి ఆడబిడ్డఅయిన కన్నూరి శిరీష(20) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడగా... వైద్యుల సూచనల మేరకు తన సోదరుడు కాలేయాన్ని దానం ఇచ్చాడు. తన సోదరి బతుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే 20 రోజులు చికిత్స పొందిన యువతి మంగళవారం ఊపిరి వదిలింది. ఈ ఘటనతో కుటుంబంలో వి షాదం అలుము కుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన కన్నూరి బాబు, శైలజ దంపతులకు నలుగురు సంతానం. వీఆర్‌ఏగా పనిచేసిన బాబు ఇటీవలే వీఆర్‌వోగా పదోన్నపతి పొందాడు. నాలుగేళ్ల క్రితం పెద్దకూతురు వివాహం చేసి అప్పులు పాలయ్యాడు.

అం తలోనే భార్య శైలజ అనారోగ్యంతో చనిపోయింది. రెండో కూతురైన శిరీషకు కడుపునొప్పి రావడ ంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. కాలే యం కొనే స్థోమత లేకపోవడంతో శిరీష సోద రుడు రవితేజ కాలేయదానానికి ముందుకొచ్చా డు. గతనెల 17న ఆపరేషన్‌ నిర్వహించి రవితేజ కాలేయాన్ని శిరీషకు అమర్చారు. 20రోజుల పాటు జీవించి ఈనెల 6న చికిత్స పొందుతూ చనిపోయి ంది.  ‘తన ప్రాణం ఏమైన మంచిదే కానీ నీవు బతకాలని.. కాలేయదానం చేసినా నిన్ను కాపాడుకోలేకపోయామని’ శిరీష సోదరుడు రవితేజ, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు