రైలు ఢీకొని విద్యార్థి మృతి

8 Apr, 2015 11:58 IST|Sakshi

వరంగల్: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు.ఈ సంఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎలుకుర్తి గ్రామానికి చెందిన మండా చందు(15) పదో తరగతి పరీక్ష రాయడానికి ధర్మారం వచ్చాడు.

దారిలో ఉన్న రైల్వే గేటు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు