నిట్‌లో గుప్పుమన్న గంజాయి

19 Nov, 2019 02:32 IST|Sakshi

కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) లో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి నిట్‌లోని 1.8కే హాస్టల్‌లో 12 మంది ఫస్టియర్‌ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద పది కిలోల గంజాయి లభించినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిట్‌ వరంగల్‌లో కట్టుదిట్టమైన సె క్యూరిటీ ఉంటుంది. అయినా విద్యార్థులు గం జాయితో పట్టుబడడం గమనార్హం. సాధారణంగా రోజూ నిట్‌లోని మొదటి ఏడాది వి ద్యార్థులు తప్ప మిగతా విద్యార్థులు బయటికెళ్లి రాత్రి 10 గంటల్లోపు కళాశాల కు చేరుకునే అవకాశాన్ని యాజమాన్యం కల్పిస్తుంది. కా గా, బయటకే వెళ్లని ప్రథమ సంవత్సరం బీటెక్‌ విద్యార్థులకు ఎవరు గంజాయి అందించి ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు