లెక్చరర్‌ను సస్పెండ్‌ చేయాలి 

7 Jul, 2019 11:07 IST|Sakshi
కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు   

సాక్షి, మెదక్‌ :  పాఠాలు చెప్పాలని అడిగితే కేసులు పెడతారా? ఎకనామిక్స్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడు ఫృథ్విరాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవడంతో వారు పరీక్షలు ఫేయిల్‌ కావడం జరిగిందని ఆరోపించారు.

విద్యార్థులు వెళ్లి క్లాసులు నిర్వహించాలని అడిగితే  శ్రీనివాస్‌తోపాటు ప్రిన్సిపల్‌ విద్యార్థులను దుర్బాషలాడుతూ వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై స్పందించిన  ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ చాంబర్‌ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మెదక్‌ పట్టణ సీఐ అక్కడికి చేరుకొని విద్యార్థులపై పెట్టిన కేసులను తీసివేసి మళ్లి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామినిచ్చినట్లు ఫృథ్విరాజ్‌ తెలిపారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించుకున్నట్లు తెలిపారు. లెక్చరర్‌ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వర్, సాయి, వంశీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు