విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

14 Jul, 2018 14:36 IST|Sakshi
స్నానమాచరించి రోడ్డుపై వస్తున్న విద్యార్థులు 

కాజీపేట అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన మైనార్టీ గురుకుల విద్యాలయంలో ని బంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాజీపేట మండలం క డిపికొండలోని మైనార్టీ గురుకుల విద్యాలయం గ తేడాది అట్టహాసంగా ప్రారంభమైంది. 5,6,7 తరగతులతో ప్రారంభమై ఈ ఏడాది ఎనిమిదో తరగతిని ప్రారంభించారు. 14 మంది ఉపాధ్యాయులు, ఒక ప్రిన్సిపాల్‌ పర్యవేక్షణలో సుమారు 235 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సామా న్య మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలకు కార్పోరేట్‌స్థాయి విద్యతో పాటు పూర్తి సంరక్షణ లభిస్తుందనే నమ్మకంతో కడిపికొండ మైనార్టీ గురుకుల విద్యాలయంలో చేర్చారు. 

విద్యార్థులపై పట్టింపేదీ.?

శుక్రవారం మైనార్టీ గురుకుల విద్యాలయంలో విద్యార్థులు స్నానమాచరించేందుకు నీరు లేని కా రణంతో ఆరుబయటకు పంపించారు. దీంతో అ భం శుభం తెలియని చిన్నారులు పాఠశాలకు ప్ర క్కనే గల పెద్ద చెరువులో కొందరు, శివాలయంలో మరికొందరు స్నానమాచరించారు. వీరిని సరైన రీతిలో తీసుకువెళ్లేందుకు ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు, వార్డెన్‌ ఎవరూ లేరు.

విద్యార్థులు స్నానమాచరించి కడిపికొండ నుంచి ఉర్సుకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఆరులైన్ల బైపాస్‌ రోడు ్డపై పరుగెత్తుకుంటూ వస్తుంటే స్థానికులు భారీ వాహనాల రాకపోకల్లో విద్యార్థులకు ఏమైన జరుగుతుందోనని కంగారుపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవా లని స్థానికులు కోరారు.నాకు తెలియకుండా పీఈటీ నిర్ణయం తీసుకున్నాడు
విద్యార్థులను విద్యాలయం నుంచి నాకు తెలియకుండా పీఈటీ ఫిరోజ్‌ఖాన్‌ పంపించాడు. ఇటీవల బోర్‌ చెడిపోవడంతో ప్రతిరోజు వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీరు అందిస్తున్నాం. కాగా, ఘటనకు బాధ్యుడైన పీఈటీని తొలగిస్తాం.   – సిద్దీఖీ, ప్రిన్సిపాల్, కడిపికొండ మైనార్టీ గురుకుల విద్యాలయం

మరిన్ని వార్తలు