ఆన్‌లైన్‌లో విద్యార్థుల మార్కులు!

8 Feb, 2018 02:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల సమగ్ర వివరాలను అప్‌లోడ్‌ చేసే చైల్డ్‌ఇన్ఫో వెబ్‌సైట్‌లో మార్కులనూ అప్‌లోడ్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలలు ఏటా నాలుగుసార్లు నిర్వహించే ఫార్మేటివ్‌ పరీక్షలు, రెండుసార్లు నిర్వహించే సమ్మేటివ్‌ పరీక్షల్లో వచ్చే మార్కుల వివరాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పొందుపరచటం లేదు. దీంతో ఆ పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారు? విద్యార్థులకు ఎన్ని మార్కులు వేశారు? అన్న వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో మార్కుల వివరాలను ఆన్‌లైన్లో పొందుపరచాలని నిర్ణయించింది. తద్వారా భవిష్యత్తులో పూర్తి వివరాలను ఒక్క క్లిక్‌తో పొందటంతో పాటు నకిలీ సర్టిఫికెట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.  

మరిన్ని వార్తలు