విద్యార్థుల భారీ ర్యాలీ

1 Sep, 2015 16:49 IST|Sakshi

సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి రంగ సమస్యలపై నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర మీడియా సెల్ ఇన్ఛార్జి ప్రతాప్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం సిద్ధిపేటలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీర్యాలీ నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. అంతకు ముందు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చీప్ లిక్కర్‌పై ఉన్న శ్రధ్ధ విద్యార్థులపై లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో వేలాది విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రనాయకులు చంద్రం, టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు రమేష్‌తో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు