తేనెటీగల దాడిలో సబ్‌కలెక్టర్‌కు గాయాలు

15 Jun, 2017 18:34 IST|Sakshi

వాజేడు: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడులోని బొగత జలపాతాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్‌, టూరిజం ఈఈ సహా పలువురికి గాయాలయ్యాయి.

జలపాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు కలెక్టర్‌ మురళి, సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌, టూరిజం ఈఈలతో కలిసి గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అధికార బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌కు చెవి, ముక్కు, గొంతు ప్రాంతాల్లో గాయాలయ్యాయి. అధికారులతో పాటు అక్కడ ఉన్న పర్యటకులపై కూడా తేనెటీగలు విరుచుకుపడటంతో.. భయంతో పరుగులు తీశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు