శాఖలపైమంత్రి సమీక్ష

18 Jun, 2014 01:58 IST|Sakshi
శాఖలపైమంత్రి సమీక్ష

కలెక్టరేట్ : ప్రభుత్వ శాఖలలో అమలవుతున్న పథకాలపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న సమీక్షించారు. మంగళవారం అటవీశాఖ కార్యాలయంలోని అతిథి గృహం లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, ఆత్మ, వెటర్నరీ, ఉద్యానవన, గ్రామీణ నీటి సరఫరాపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ముందుగారా మన్నను ఆయా శాఖల ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు, గతేడాదిలో శాఖలవారీగా లక్ష్యం, సాధించిన ప్రగతి నివేదిక లు తనకు సమర్పించాలని సూచించారు.
 
పెండింగ్ బడ్జెట్ పూర్తి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాఖల మీద అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నార్నూర్ మం డలంలోని వెటర్నరీ భవనానికి సంబంధించి నిధులు రాలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెట ర్నరీ శాఖలో ఉద్యోగుల ఖాళీలు తదితర వివరాలు తన కు పంపించాలన్నారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ, డెయిరీఫాంలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్‌షెడ్లు జిల్లాలో ఎన్ని ఉన్నాయని అడగగా, జిల్లాలో 30 చోట్ల వాటర్‌షెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులకు శిక్షణ అందించడంలో ఆత్మ వెనుకబాటుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకు సంబంధించిన వివరాలు తనకు పంపాలన్నారు. హార్టికల్చర్ పంటలకు సంబంధించి మామిడి, పసుపు, మిర్చి, అరటి, కూరగాయల పంటలను పండిం చే విధానం, జిల్లాలో ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలుసుకున్నారు.
 
21,673 హెక్టార్లలో మామిడి, 2,600 హెక్టార్లలో పసుపు పండిస్తున్నారని ఏడీ రమణ పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలులో జిల్లా వెనుకబడి ఉందన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది 27 కంపెనీలకు చెందిన 20.63 లక్షల ప్యాకెట్ల విత్తనాలు మన జిల్లాకు వచ్చాయని జేడీఏ రోజ్‌లీల తెలిపారు. నష్టపరిహారం వచ్చిందా? ఇంకేంత రా వాల్సి ఉంది? అనే విషయాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. విత్తనాల ఉత్పత్తిపై సీఎం కేసీఆర్  దృష్టి సారించినట్లు తెలిపారు.
 
అయితే జిల్లాలో గోదాముల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న జననీ సురక్ష యోజన తదితర పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు, నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎడీఎహెచ్ రామరావు, కుమారస్వామి, నర్సింగ్‌రావు, హార్టికల్చర్ ఏడీ రమణ, ఆత్మ పీడీ మనోహర్, జేడీ ఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు