పరిశ్రమల స్థాపనకు రాయితీలు

28 Nov, 2019 03:17 IST|Sakshi
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మలేíసియాలో స్వాగతం పలికిన మైట అధ్యక్షుడు తిరుపతి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

మలేసియాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

సిరిసిల్ల: పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనువైందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన మలేషియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో మలేసియా తెలంగాణ అసోసియేషన్‌ (మైట) ఏర్పాటు చేసిన సదస్సులో బుధవారం మంత్రి మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ ఐటీ పార్కు., మల్టీ పర్పస్‌ పార్కులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రవాసులు స్వరాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే.. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది వివిధ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ‘మైట’అధ్యక్షుడు సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్‌ సత్య, ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి, ఉపాధ్యక్షురాలు అశ్విత, ముఖ్య కార్యవర్గ సభ్యులు కిరణ్‌గౌడ్, ప్రతీక్, సత్య, సందీప్, సంతోష్, మలేసియా తెలుగు ఫౌండేషన్‌ అధ్యక్షులు కాంతారావు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు