కేంద్రమే ఉత్తర్వులివ్వాలి

10 Sep, 2016 03:40 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న లక్ష్మణ్. చిత్రంలో సుద్దాల తదితరులు

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంపై సుద్దాల అశోక్‌తేజ

 సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ సూచించారు. ఒక దసరా, ఒక సంక్రాంతి లాగా నరకాసుర వధ అనంతరం కొత్త దీపావళి మాదిరిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ మీడియా సెల్ నిర్వహించిన ‘తెలంగాణ విమోచనదినం జ్ఞాపకాలు’ సదస్సులో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నవారు, ఆయా కుటుంబాలకు చెందిన వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఇందులో అశోక్‌తేజ పాల్గొన్నారు.

నిజాం పాలనలోనే చైన్ స్నాచింగ్‌లు జరిగాయని, విలీనం రోజు నిజాం నివాసం నుంచి లారీల నిండా మహిళల పుస్తెలు, మట్టెలు తరలి వెళ్లాయని కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఒకవైపు కొమురంభీమ్, మరోవైపు నిజాంలను కీర్తిం చడం టీఆర్‌ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అ న్నారు. నాటి పోరాటంలో కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డికొమురయ్య వంటి వారిని స్మరించుకోవడం కూడా రాజకీయం చేస్తున్నవారికి తెలంగాణ సమాజమే సరైన సమాధానం చెబుతుందన్నారు. బీజేపీ కార్యక్రమాలు హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి కాదని సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. నీతిలేని నిజాంకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు కూడా నీతి లేద ని సీనియర్‌నేత పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. వెల్చాల కొండలరావు తదిత రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు