కరోనా కారు.. చూశారా మీరు?

8 Apr, 2020 14:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ మనవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారిపై అంతర్జాతీయంగా పోరు కొనసాగుతోంది. పాలకులతో పాటు ప్రజలూ కోవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే అవగాహనా లోపంతో చాలా మంది కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. దీంతో కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రభుత్వాలతో  పాటు స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు కృషి చేస్తున్నాయి.
 
హైదరాబాద్‌కు చెందిన సుధా కార్స్‌ మ్యూజియం కూడా కరోనాపై అవగాహన పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా కరోనావైరస్‌ ఆకారంలో కారును తయారుచేసింది. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు దీన్ని రూపొందించినట్టు సుధా కార్స్‌ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. కాగా, కరోనా వైరస్‌ ఆకారంతో రూపొందించిన హెల్మెట్లు ధరించి పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. (ప్లీజ్‌.. ఆ మందు మాకూ ఇవ్వండి)

మరిన్ని వార్తలు