పెళ్లికావడం లేదనే బెంగతో ఆత్మహత్య

14 Aug, 2015 02:01 IST|Sakshi

చిట్యాల : తానకు నత్తి ఉందని, అందుకోసమే తనకు పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో యువకుడు విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలిలా ఉన్నాయి. చల్లగరిగె గ్రామానికి చెందిన దావు రాణి, శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు రాజిరెడ్డి(26)కి పుట్టుకతో   నత్తి. గత మూడేళ్ల నుంచి రాజిరెడ్డికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అరుుతే అతనికి అమ్మారుుని ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. కాగా, గురువారం తన వ్యవసాయ బావి వద్ద మిరప తోటకు విష గుళికలు వేసేందుకు వెళ్లాడు .

తనకు జీవితంలో ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురై విష గుళికలు మింగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు