గురుకులంలో ‘సమ్మర్ సమురాయ్'

15 Apr, 2016 13:35 IST|Sakshi

కొండాపూర్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని గుర్తించిన రంగారెడ్డి జిల్లా గురుకుల పాఠశాల వేసవిలో' సమ్మర్ సమురాయ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. విద్యా సంబంధ అంశాలతోపాటు ఆటపాటల్లో నిపుణులైన వారితో విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. మెదక్ జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలకు చెందిన 125 మంది విద్యార్థులను కొండాపూర్‌లోని గురుకుల ఉన్నత పాఠశాలలో వసతి సౌకర్యాలు కల్పించింది.

ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా గురుకుల పాఠశాలల కో ఆర్డినేటర్ గణపతి తెలిపారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా విద్యార్థికి ఎంతో అవసరమని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ సూచించారని, ఆయన ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గోదావరి తెలిపారు.


 
 

>
మరిన్ని వార్తలు