వేసవిలో జర భద్రం

29 Mar, 2018 09:38 IST|Sakshi
హిమబిందు

తగు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి

పీహెచ్‌íసీ వైద్యాధికారి హిమబిందు

పెద్దఅడిశర్లపల్లి : వేసవిలో వడ దెబ్బకు గురికా కుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీఏపల్లి పీహెచ్‌సి వైద్యాధికారి హిమబిందు కోరారు. మంగళవారం ఆమె స్థానికంగా మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల తాకిడితో డిహైడ్రేషన్‌తో శరీరంలో నీరు తగ్గడమే వడదెబ్బగా భావించాలని అన్నారు. ఎండలో అధిక వేడిలో తిరగడంతో ఇది ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజూ 5 లేదా 6 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కవ ప్రాధాన్యం ఇస్తూ, శరీరంతో పాటు ఇంటిని చల్లగా ఉంచుకోవాలి. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారిణి పలు సూచనలు చేశారు.

తీవ్ర ఎండ, ఉష్ణోగ్రత సమయాల్లో ఎక్కువగా బయట తిరగకూడదు. రోడ్లపై విక్రయించే రంగు పానియాలు, కలుషిత ఆహారం తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు తీసుకోవాలి.
శరీర ఉష్ణోగ్రత్త సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో శరీరమంతా తూడ్చి ఫ్యాన్, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించి వీలైనంత త్వరగా ప్రభుత్వ   ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించాలి. 

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలి. అత్యవసరం ఉంటే త్వరగా పనులు ముగించుకోవాలి. బయట లేత రంగు, తేలికైన, కాటన్‌ దుస్తువులు, టోపి, గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్, మజ్జిగ, గ్లూకోజ్‌ లాంటి ద్రావణాలు దెగ్గర ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలి.

మరిన్ని వార్తలు