నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

2 May, 2019 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు మే 2వ తేది నుంచి మే 31వ తేది వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే అత్యవసర కేసుల్ని విచారణ జరిపేందుకు మాత్రం వెకేషన్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ వెకేషన్‌ కోర్టులు రెండు విడతలోŠల్‌ పనిచేస్తాయి. మొదటి విడత వెకేషన్‌ కోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఉంటారు. మే 6న కేసులు ఫైల్‌ చేస్తే, వాటిని వెకే షన్‌ కోర్టులు 8వ తేదీన, 13న దాఖలు చేసే కేసులను 15న ఈ వెకేషన్‌ కోర్టులు విచారిస్తాయి

ఇక రెండో విడత వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ చల్లా కోదండరామ్‌లు ఉం టారు. 20న దాఖలు చేసే కేసులను 22న, 27న దాఖ లు చేసే వాటిని 29న విచారణ జరుపుతారు. హెబియస్‌ కార్పస్‌లు, ముందస్తు బెయిల్స్, బెయిల్స్, ఇతర అత్యవసర కేసులను మాత్రమే వెకేషన్‌ కోర్టు ల్లో విచారణ చేపడతారని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు