అనారోగ్యంతో రాలేకపోతున్నా:సండ్ర

20 Jun, 2015 02:30 IST|Sakshi
అనారోగ్యంతో రాలేకపోతున్నా:సండ్ర

సాక్షి, హైదరాబాద్: ‘ఓటు కు కోట్లు’ కేసులో సాక్షిగా హాజరుకావాలని ఏసీబీ నుంచి నోటీసు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విచారణకు హాజరుకాలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినందున రావడం లేదని శుక్రవారం ఏసీబీ ఏ ఎస్పీ మల్లారెడ్డికి లేఖ పంపారు. 10 రోజులు ఆసుపత్రిలోనే ఉంటానని, ఆసుపత్రికి వచ్చి విచారిస్తే అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. అయితే ఏ ఆసుపత్రిలో ఉన్నారనే విషయాన్ని మాత్రం లేఖలో పేర్కొనలేదు.
 
సండ్ర లేఖ యథాతథంగా: ‘శ్రీయుత గౌరవనీయులైన ఏసీబీ, ఏఎస్పీ ఎం.మల్లారెడ్డి గారికి, ఆర్యా, పీఎస్, ఏసీబీ, సీఆర్-1, సీఆర్ నెం.11/ఏసీబీ-సీఆర్-1/హైదరాబాద్ /2015, తేదీ 16-06-2015న కేసు విచారణ లో భాగంగా నాకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ కార్యాలయానికి 19-06 -2015న హాజరుకావలసిందిగా నాకు నోటీసు ఇచ్చినట్లు మీడి యా ద్వారా, మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఈ విచారణ నిమిత్తం పూర్తిస్థాయిలో సహకరిస్తా ను. అయితే వ్యక్తిగత కారణాలతో పర్యటనలో ఉన్న సమయంలో తీవ్రమైన వెన్ను, కుడికాలు నొప్పి ఉన్నందున అందుబాటులో ఉన్న డాక్టర్లను సంప్రదించడం జరిగింది.

వారు 10 రోజులు పూర్తిగా పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా, ప్రయాణాలను వాయిదా వేసుకోవలసిందిగా సూచిం చడం జరిగింది. వారి సలహా మేరకు ప్రస్తుతం నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నాను. ఈ పరిస్థితుల్లో మీ వద్దకు రాలేకపోతున్నందు కు చింతిస్తూ, కోలుకున్న వెంటనే వచ్చి విచారణకు సహకరించగలను. లేదా మీరు నేనున్న ఆసుపత్రికి వచ్చిన యెడల మీకు కావలసిన స మాచారాన్ని ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. మీ ఫోన్ నంబర్ లేనందున ఈ లేఖను మిత్రుడి ద్వారా పంపుతున్నాను.’
- సండ్ర వెంకట వీరయ్య
 

మరిన్ని వార్తలు