మాటలు కోటలు దాటుతున్నా...

11 Mar, 2015 13:20 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించయారు. మాటలు కోటలు దాటుతున్నా కాళ్లు గడప దాటడంలేదన్న చందంగా బడ్జెట్ ఉందన్నారు. గత బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు ఖర్చు చేయలేదని మళ్లీ వాటినే ఈ బడ్జెట్ లో చూపించారని ఆరోపించారు. సేవా రంగాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.

పెరుగుతున్న ధరలకు హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచలేదన్నారు. అణగారిన వర్గాలకు నామమాత్రంగా కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు. గిరిజన సంక్షేమానికి కనీసం పదివేల కోట్ల రూపాయిలు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. అంగన్ వాడీలకు కంటితుడుపు వేతనాలు పెంచారన్నారు.

మరిన్ని వార్తలు