వడదెబ్బకు రాలిన ప్రాణాలు

22 May, 2015 00:04 IST|Sakshi

మృతుల్లో ఇద్దరు రైతులు,
ఒక ఉపాధి కూలీ, ఉపాధ్యాయుడు, వృద్ధుడు
బాధిత కుటుంబాల్లో విషాదం

 
 వర్గల్/పాపన్నపేట/చిన్నకోడూరు/ తూప్రాన్ /ములుగు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన రైతు గడ్డం నర్సయ్య (68) తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో వరిని సాగు చేశాడు. బుధవారం మిషన్‌తో వరి కోయించాడు. అదేరోజు కొడుకు స్వామితో కలిసి పొలంలో వరిగడ్డిని కట్టలుగా కట్టి ఇంటికి తరలించే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి ఇంటికి చేరిన నర్సయ్య వడదెబ్బ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యాడు.గురువారం ఉదయం వరకు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యు లు అతడిని 108లో గజ్వేల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య యాదమ్మ, కుమారుడు స్వామిలు ఉన్నారు.  

 పాపన్నపేట మండలం  బాక్యా తండాకు చెందిన దేవసోత్ కిషన్ (56) వారం రోజులుగా గ్రామశివారులోని మాచిరెడ్డికుంటలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా పనులు హాజరయ్యాడు. అయితే మధ్యాహ్నం ఒ క్కసారిగా.. కిషన్ వడదె బ్బతో కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఇం టికి తీసుకువచ్చే సారికి అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య పెంటి, కు మార్తె చాంగును, కుమారులు మోహన్, వసంత్, శ్రీనివాస్‌లు ఉన్నా రు.  

 చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన కొమ్మెర మల్లారెడ్డి (65) వ్యసాయ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉద యం పనులకు వెళ్లి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కు టుంబీకులు ఆస్పత్రికి తరలించే క్రమం లో మల్లారెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య శాంతవ్వ, కుమారుడు రవీం దర్‌రెడ్డిలు ఉన్నారు. మృతుడి కుటుం బాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పరకాల వజ్రమ్మ, ఎంపీటీసీ భూంరెడ్డిలు కోరారు.

 తూప్రాన్ పట్టణానికి చెందిన గడ్డం శ్రీనివాస్ (33) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం బంధువుల శుభ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఎండలో బాగా తిరిగి అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం ఉదయం బంధువులు ఇంటికెళ్లగా అక్కడ శ్రీనివాస్ విగతజీవుడై పడి ఉన్న విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  మృతుడికి భార్య అనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

 ములుగుకు చెందిన తీగుళ్ల కిష్టయ్య (60) ప్రతి రోజూ పశువులను మేతకు తిప్పుకువస్తుంటాడు. గురువారం కూ డా  పశువులను మేతకు వెళ్లిన కిష్టయ్య ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య చం ద్రమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

 వడదెబ్బతో వివాహితకు అస్వస్థత
 రామాయంపేట మండలం కోనాపూర్ చిన్నతండాకు చెందిన సునీత గురువారం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. వివరాలిలా ఉన్నాయి.. వారం రోజులుగా సునీత వ్యవసాయ పనుల కు వెళుతోంది. ఇటీవల కాలంలో ఎండల ప్రభావం పెరగడంతో గురువారం వడదెబ్బకు గురైంది. దీంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

మరిన్ని వార్తలు