వారసత్వ కట్టడాల పరిరక్షణపై సుప్రీం నోటీసులు

15 Feb, 2020 01:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పురాతన, వారసత్వ, సాంస్కృతిక సంపద జాబితాలోని కట్టడాలను పరిరక్షించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పిటిషనర్‌ పాశం యాదగిరి తరఫున సీనియర్‌ న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదనలు వినిపించారు.

గతంలో ఆయా కట్టడాలు హెరిటేజ్‌ యాక్ట్‌లో ఉండేవని, 132 కట్టడాలను వారసత్వ జాబితా నుంచి తొలగించారని, ఆ భవనాలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నందున ఆయా భవనాలకు రక్షణ లేదని నివేదించారు. పిటిషన్‌పై అభిప్రాయం కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు