అభ్యర్థుల ఎంపికపై వీడని ఉత్కంఠ

20 May, 2015 20:19 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ఇంకా అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. గురువారంతో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో బుధవారం రాత్రికి అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖారరైంది.

మరోవైపు అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, కడియం శ్రీహరి పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. యాదవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నేతి విద్యాసాగర్, బి. వెంకటేశ్వర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అటు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అభ్యర్థి ఎంపికపై చర్చించి నిర్ణయానికి రావాలని రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, గరికపాటి రామ్మోహనరావులకు చంద్రబాబు సూచించారు. వేం నరేందర్ రెడ్డి, అరవింద కుమార్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు