ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర

27 Oct, 2019 01:43 IST|Sakshi
శనివారం మఖ్దూంభవన్‌లో నిరవధిక దీక్ష చేస్తున్న కూనంనేని 

సమ్మె పరిష్కారానికి కూనంనేని చేపట్టిన నిరవధిక దీక్షలో సీపీఐ నేత సురవరం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రైవేటీకరించి, వేల కోట్ల విలువ చేసే ఆ సంస్థ ఆస్తుల్ని సీఎం కేసీఆర్‌ తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. సీఎం తన వైఖరిని మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం జరిగేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక దీక్షను సురవరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ..సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి, బెదిరింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. దీక్షలో ఉన్న కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ఉద్యమనేతగా ఉన్న వ్యక్తి సీఎం అయ్యాక కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. సమ్మె పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం..

హోరెత్తిన ధర్నాలు

మలి సంధ్యలో మతాబుల వెలుగులు

జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..!

ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’

ఈనాటి ముఖ్యాంశాలు

హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ వరాల జల్లు

ఆర్టీసీ చర్చలు : ‘అందుకే బయటికి వచ్చేశాం’

అర్ధాంతరంగా ముగిసిన ఆర్టీసీ చర్చలు

ఆ ఇల్లు ఓ నందనవనంలా.. ఉమ్మడి కుటుంబం

షైన్‌ ఆసుపత్రి ఘటనపై హైకోర్టు సీరియస్‌

బాసర ట్రిపుల్‌ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు

ఇంకెనాళ్లొ ఈ ఎదురు చూపులు..

పట్టు బట్టారు..కొలువు కొట్టారు

పోలీసుశాఖలో భారీగా బదిలీలు !

కేసీఆర్‌ సారొస్తుండు!

‘కంటి వెలుగు’.. కదులుతున్న డొంక

ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దీపావళికీ చీకట్లే!

టిమ్‌ మరిచిన కండక్టర్‌..

కబూతర్‌ జా..జా

సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం..మళ్లీ అదే పని

సారు... హెల్మెట్‌ మరిచారు

డిగ్రీ తర్వాత ఇంటర్‌ పూర్తి..!

ఐలా.. చూస్తూ ఉంటే ఎలా..?

35 ఏళ్లలో ఏడోసారి

కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి

‘సీఎం కేసీఆర్‌ చెప్పేవి అబద్ధాలు’

అశ్వత్థామరెడ్డిపై కేసు పెట్టిన డ్రైవర్‌

రాష్ట్రానికి ధాన్య కళ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌