పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ ప్రారంభం

25 Mar, 2017 14:26 IST|Sakshi
పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ ప్రారంభం
హైదరాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా రైల్వే లైన్ ను స్టార్ట్ చేశారు.  మహబూబ్ నగర్ - సికింద్రాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కూడా సురేశ్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
 
కేంద్ర మంత్రి రైల్వే లైన్ ను ప్రారంభించిన తర్వాత నిజామాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. మంగళ, గురువారాలు మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. ఆ రెండు రోజులు నిజామాబాద్ స్టేషన్‌లోనే రైలును నిలిపివేస్తారు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పదమూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
మరిన్ని వార్తలు