తెలంగాణ: రాగల 3 రోజుల్లో వర్ష సూచన

22 Apr, 2020 15:51 IST|Sakshi

0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌:  రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. దక్షిణ జార్ఖండ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు, ఇంటీరియర్‌ ఒరిస్సా  నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్‌‌, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దీంతో  బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతేగాక శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు