కమ్యూనిటీ వ్యాప్తిపై సర్వే..

31 May, 2020 02:01 IST|Sakshi
ఓల్డ్‌ హఫీజ్‌పేట్‌ సాయినగర్‌ కాలనీలో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్యులు

ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా నిర్వహణ

కంటైన్మెంట్‌ జోన్లలో రక్త నమూనాల సేకరణ

మద్రాస్‌ ఐసీఎంఆర్‌ ల్యాబ్‌కు తరలింపు

500 మంది నమూనాల సేకరణ

హఫీజ్‌పేట్‌/చందానగర్‌: కరోనా వైరస్‌ కమ్యూనిటీ విస్తరణ ఏ మేరకు ఉందనే అంశంపై నిగ్గుతేల్చేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషన ల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సంస్థలు ప్ర ధాన నగరాల్లోని కంటైన్మెంట్‌ జోన్లలో రక్త నమూనాల సే కరణ ప్రారంభించాయి. ఇందుకు హైదరాబాద్‌లో 5 కం టైన్మెంట్‌ జోన్లను ఎంపిక చేశారు. ఒక కంటైన్మెంట్‌లో 10 బృందాలు రెండు రోజుల పాటు జోన్‌కు 100 చొప్పున మొత్తం 500 నమూనాలు సేకరిస్తున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన సర్వే ఆదివారం కొనసాగనుంది. ఈ సర్వేలో ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మయ్య నేతృత్వంలోని బృందాలు సర్వే చేస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌ సర్కిల్‌–21 పరిధిలోని మియాపూర్‌ ఓల్డ్‌ హఫీజ్‌పేట్‌ సాయినగర్‌ కాలనీ, చందానగర్‌లోని అపర్ణ బ్రీజ్‌ అపార్ట్‌మెంట్‌లో శనివారం సర్వే చేశారు. రాష్ట్రంలోని గ్రీన్‌ జోన్లు అయిన నల్లగొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల ఇంటిం టి సర్వే చేసి, నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

చెన్నైకి రక్త నమూనాల తరలింపు: కంటైన్మెంట్‌ జోన్లలో సేకరించిన రక్త నమూనాలను చెన్నైలోని ఐసీఎంఆర్‌ ల్యాబ్‌కు తరలిస్తామని లక్ష్మయ్య తెలిపారు. రెండ్రోజుల్లో ఈ నమూనాలపై కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు.

ర్యాండమ్‌గా నమూనాల సేకరణ
ఐసీఎంఆర్‌ బృందం శనివారం రంగారె డ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో పర్యటించింది. పలు కాలనీల్లో ర్యాండమ్‌గా యాభై మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఆదివారం మరో 50 మంది నుంచి ర్యాండమ్‌ పద్ధతిలో శాంపిళ్లను సేకరించనున్నట్టు బృందానికి చెందిన అధికారులు తెలిపారు.

5కంటైన్మెంట్‌ జోన్లలో..
జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ఆధారంగా ప్రత్యేకంగా కంటైన్మెంట్‌ జోన్లలో ఐసీఎంఆర్‌ సంస్థ ఇంటింటి సర్వే ప్రారంభించింది. కంటైన్మెంట్‌ జోన్లయిన మియాపూర్, చందానగర్, బాలాపూర్, ఆదిబట్ల, టప్పాచపుత్రలో రక్త నమూనాల సేకరణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేని పాజిటివ్‌ కేసులను కనిపెట్టేందుకు చందానగర్‌ సర్కిల్‌–21 పరిధిలోని కంటైన్మెంట్‌ జోన్లలో శనివారం నిర్వహించారు. డా.దేవరాజ్, డా.మిష్రాన్, డా.రవీంద్ర, మహేశ్‌లు రెండు బృందాలుగా ఏర్పడి రక్త నమునాలు సేకరించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు, కరోనా నివారణకు ఈ సర్వే దోహదం చేస్తుందన్నారు. పట్టణాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, ప్రధానంగా సంక్రమణ ఎంతమేర జరిగింది.. ఒకవేళ సోకితే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయా అన్న విషయాలు తెలుసుకుంటామని వివరించారు.
సాయినగర్‌ కాలనీలో ఓ మహిళ నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది..

మరిన్ని వార్తలు