కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి..

3 May, 2018 08:14 IST|Sakshi
కండువాలు కప్పుతున్న సంకినేని

సూర్యాపేట అర్బన్‌ : తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపేనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం సూర్యాపేటలోని తన నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని రావులపల్లి క్రాస్‌ రోడ్డుతండాకు చెందిన గుగులోతు వెంకన్న నాయకత్వంలో 25 కుంటుంబాల వారు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్యం గ్రామాల్లో పేద కుటుంబాలకు ఉపాధి హామీ ద్వారా పని కల్పింస్తుంటే, వారికి చెల్లించాల్సిన డబ్బులను టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు స్వాహా చేస్తున్నారన్నారు.

చివ్వెంల మండలంలో ఉపాధి హామీ డబ్బులు సక్రమంగా చెల్లించటం లేదని ప్రజలు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చేయని పనులను చేసినట్లుగా చూపుతూ నిధులను మింగుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌రావు, హబిద్, సలిగంటి వీరేంద్ర, ఏడుకొండలు, సందీప్‌నేత, బిట్టు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు