అన్ని పార్టీలకూ...అసమ్మతి సెగ!

15 Apr, 2014 00:15 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  సార్వత్రిక వేడి ఎక్కువవుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్‌కు 15రోజులు మాత్ర మే ఉండడంతో అటు ప్రచార పర్వం లో బిజీగా ఉన్న అభ్యర్థులు.. ఇటు పార్టీలోని ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలూ ముమ్మరం చేశారు. వారి అలకతో అనుచరగణం దెబ్బతినకుండా ఉండేందుకు నేరుగా మం తనాలు సాగించేపనిలో నిమగ్నమయ్యారు. ఉదయం అంతా ప్రజల్లోకి
  వెళ్తున్న అభ్యర్థులు.. సాయంత్రానికి పార్టీ నేతలు, అనుచరులతో సమావేశాలు సాగిస్తున్నారు.

 ‘చేయి చేయి’ కలుపుదాం..
 కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల బెడద తీవ్రంగా ఉంది. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేత వెంకటస్వామి స్వతంత్రుడిగా రంగంలోకి దిగి చివరి నిమిషంలో వెనక్కితగ్గారు. అయితే తనకు వెన్నంటి ఉన్న అనుచరులు మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు. మరోైవె పు వికారాబాద్ వ ూజీ ఎమ్మెలే ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే టికెట్ ఆశించి భంగపడడంతో చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన అధిష్టానం ఆదేశాలతో పోటీ నుంచి తప్పుకున్నారు.

 ఇక్కడ చంద్రశేఖర్ అనుచరుల మద్దతు కూడగట్టేందుకు నేతలు తలమున కలవుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన మల్‌రెడ్డి రంగారెడ్డి, సోదరుడు రాంరెడ్డి ఇరువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అయితే రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి మారడంతో రాంరెడ్డి మాత్రం పోటీకి సై అన్నారు. హయత్‌నగర్‌లో ప్రభల్యం ఉన్న ఉన్న రాంరెడ్డి పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు స్థానిక నేతలు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

 ‘సైకిల్’కు రెబల్స్ బ్రేక్!
 తెలుగుదేశంలో అసమ్మతుల సెగ అభ్యర్థులకు కునుకు పడనివ్వడం లేదు. మేడ్చల్ టీడీపీ టికెట్ ఆశించిన నందారెడ్డి, నక్క ప్రభాకర్ ఇరువురు స్వతంత్రంగా రంగంలోకి దిగారు. అయితే నందారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ప్రభాకర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ అధిష్టానం సోమవారం అతడిపై వేటు వేసింది. మరోవైపు ఎల్‌బీనగర్ నుంచి టీడీపీ టికెట్ చివరినిమిషంలో బీసీ సంఘ నేత ఆర్.కృష్ణయ్యకు ఖరారు కావడంతో అంతకు ముందు నుంచి టికెట్ వస్తుందని ఆశిం చిన రంగారెడ్డి, కృష్ణప్రసాద్‌లను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం నానాతంటాలూ పడింది. మరోవైపు చేవెళ్ల టీడీపీ టికెట్ ఆశించిన జోగు వెంకటయ్యకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో వెంకటయ్య తనయుడు అశోక్ స్వతంత్రంగా బరిలోకి దిగారు. దీంతో ఆక్కడ టీడీపీలో ఏర్పడిన చీలికను పూడ్చే ప్రయత్నానికి పూనుకున్నారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ మారడంతో క్యాడర్‌లోనూ సందిగ్ధం ఏర్పడింది.

 మన ‘కారు’లో వెళ్దాం బ్రదర్
 ఉద్యమ నేపథ్యం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం.. ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు వలస రావడంతో జిల్లాలో బలపడుతున్న టీఆర్‌ఎస్ పార్టీకి సైతం అసంతృప్తుల నుంచి గట్టిదెబ్బే తగిలింది. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్నవారికి టిక్కెట్లు రాకపోవడంతో ఆశావహులు గుర్రుగా ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన దేశమల్ల ఆంజనేయులుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ను స్థానికేతరుడు శేఖర్‌రెడ్డికి ఇవ్వడంతో అక్కడి నేతలు తీవ్ర నిరుత్సాహం కనబరుస్తున్నారు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు అభ్యర్థులను ఇరకాటంలో పడేశారు. దీంతో పార్టీ అధిష్టానం నుంచి రాయబారాలు నడుపుతూ సహకారం కోసం అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు