మూల్యాంకనం బహిష్కరణ

18 Mar, 2016 03:40 IST|Sakshi
మూల్యాంకనం బహిష్కరణ

సుప్మా ఆధ్వర్యంలో నిరసన

కమాన్‌చౌరస్తా: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు తక్షణమే విడుదల చేయాలని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (సుప్మా) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మూల్యాంకనం బహిష్కరిస్తామని ఆ సంఘం నాయకులు హెచ్చరించారు. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం నిరసన వ్యక్తం చేసి రిజిస్ట్రార్ ఎం. కోమల్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం పరీక్షల నియంత్రణాధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలయ్యే వరకు యూనివర్సిటీ ఎలాంటి ఫీజులను డిమాండ్ చేయొద్దని, విద్యార్థులకు రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు ఒకే హాల్‌టికెట్ అందించాలని కోరారు. సుప్మా అధ్యక్షుడు వి. సతీశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వర్‌రావు, ప్రతినిధులు పి. వేణు, వి. రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు