ఇద్దరు అవినీతి ఇన్‌స్పెక్టర్ల సస్పెన్షన్‌

1 Aug, 2018 00:36 IST|Sakshi
సీఐనర్సింహారెడ్డి ,సీఐసైదిరెడ్డి

తాండూర్, హుజూర్‌నగర్‌ సీఐలపై వేటు

అక్రమాలపై విచారణకు ఆదేశించిన ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులను సస్పెం డ్‌ చేస్తూ వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. తాండూర్‌ సీఐ సైదిరెడ్డి, హుజూర్‌నగర్‌ సీఐ నర్సింహారెడ్డిలు అవినీతికి పాల్పడ్డట్లు అంతర్గత విచారణలో తేలింది.

భారీస్థాయిలో ఇసుక దందాకు సహకరించడం, లారీలు, ట్రాక్టర్ల నుంచి డబ్బుల వసూళ్లు, గుట్కా కార్యకలాపాలు సాగిస్తున్న వారితో సంబంధాలు, మట్కా స్థావరాలు తెలిసినా కేసులు పెట్టకుండా మేనేజ్‌చేస్తూ రావడం లాంటి అంశాలపై పోలీసుశాఖ అంతర్గత విచారణ జరిపించింది. తాం డూర్‌ సీఐ సైదిరెడ్డి 3 హత్య కేసుల్లో నిందితులను కాపాడే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్‌ చేసినట్లు ఆ శాఖ తెలిపింది.

సీఐ నర్సింహారెడ్డి ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను అధికారికంగా తొలగించి అనధికారికంగా వసూళ్లు చేస్తున్నట్లు రుజువైందని అధికారులు తెలిపారు. కాకినాడలో బెదిరిం పులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యా దు వచ్చిందని, దీనిపై విచారణ జరపగా నిజమేనని తేలిందన్నారు. వీరిద్దరిపై మౌఖిక విచారణకు ఆదేశించామని, బాధితులు ఎవరున్నా నేరుగా ఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది.

>
మరిన్ని వార్తలు