సీఎం, మంత్రుల పేరిట పార్సిల్స్‌ కలకలం

20 Aug, 2019 19:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పోస్టల్‌ ఆఫీస్‌లో అనుమానస్పద పార్సిల్స్‌ కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు అధికారుల పేరిట రసాయనాలతో కూడిన 50 బాటిళ్లు పార్సిల్స్‌ రూపంలో రావడంతో అధికారులు ఆందోళనకు గరయ్యారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ పార్సిల్స్‌ బాటిళ్లలో రసాయనాలు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాటిళ్లలోని రసాయనాల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయిస్తున్నారు. దీనిపై పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమచారం తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా