స్వచ్ఛభారత్ మిషన్ ఏర్పాటు

31 Mar, 2015 02:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటి, పారిశుధ్య మిషన్(ఎస్‌డబ్ల్యూఎస్‌ఎం) స్థానంలో కొత్తగా రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్(గ్రామీణ్) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మిషన్ విధానాల రూపకల్పన నిమిత్తం ఎస్‌ఎస్‌బీఎం(జి)కు గవర్నింగ్ బాడీ, అపెక్స్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. పంచాయతీరాజ్ మంత్రి చైర్మన్‌గా ఉండే గవర్నింగ్ బాడీ కి వైస్‌చైర్మన్‌గా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు.

ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే అపెక్స్ కమిటీలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి మిషన్‌డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఆర్థిక, ఆరోగ్య, సమాచార శాఖల ముఖ్య కార్యదర్శులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.  అదేవిధంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలో కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు